34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యంకాదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదని, కోవిడ్, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని చెప్పిన సజ్జల ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్లు పరిష్కారంపైనా చర్చించాం,  అన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తామన్నారు. కరోనా వల్ల , కేంద్రం నుంచి రావాల్సినవి రాకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని పేర్కొన్నారు. సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఐఆర్ ను అమలు చేస్తూ ఐఆర్ కు రక్షణ ఉండేలా చూస్తామని.. ఇప్పుడిస్తున్న ఐఆర్ 27శాతం కంటే ఎక్కువగానే లబ్ది చేకూరేలా నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. రేపటికి పీఆర్సీ పై చర్చల ప్రక్రియ పూర్తికావచ్చని సజ్జల. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఉండవచ్చు లేదా సోమవారం చర్చలు ఉండొచ్చని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన ఉంటుందని సజ్జల తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)