అమ్మాయి పెళ్లి వయసు 21 ఏళ్లు

Telugu Lo Computer
0


2020 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... అమ్మాయి పెళ్లి వయసును 21సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర తర్వాత ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు అంగీకారం లభించింది. కేబినెట్ ఆమెదించిన బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్ట సవరణను పార్లమెంట్‌ ముందుకు రానుంది. అదే సమయంలో ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు సవరణలు తీసుకొస్తుంది. తల్లిమరణాల రేటు తగ్గించి, పోషకాహార లోపాలు పరిశీలించేందుకు జయ జైట్లీ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిశోధించింది. చాలా మంది నిపుణులతో మాట్లాడింది. సమస్యలు తెలుసుకొని కొన్ని సిఫార్సులతో తన రిపోర్టును 2020 డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కు ఇచ్చింది. దీన్ని పరిశీలించిన కేంద్రమంత్రి మండలి బుధవారం దీనికి ఆమోదం తెలిపింది. జనాభా నియంత్రణ కోసమే ఈ సిఫార్సులు చేయలేదన్నారు జయజైట్లీ. ఇటీవలే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని చెప్పింది. జనాభా నియంత్రణలోనే ఉందని చెప్పారు. అందుకే తాము మహిళా సాధికారత కోసం ఈ సిఫార్సులు చేసినట్టు చెప్పారు

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)