సూర్యపై బీజేపీ నేత విమర్శలు

Telugu Lo Computer
0


సూర్య నటించిన 'జై భీమ్' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. సినిమా విజయాన్ని అతడి అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో బీజేపీ నేత హెచ్.రాజా ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు. జాతీయ విద్యా విధానం (నెప్)లో భాగంగా పిల్లలు మూడు భాషల్లో విద్య నేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ఓ వ్యక్తి తన సినిమా (జై భీమ్)ను మాత్రం ఐదు భాషల్లో విడుదల చేశారని, దీనిని బట్టి అతడెంత స్వార్థపరుడో అర్థం చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన వారు చాలామంది సూర్య గట్టిగానే బదులిస్తాడని భావించారు. అయితే సూర్య మాత్రం సింపుల్‌గా ఆ ట్వీట్‌ను 'లైక్' చేసి అక్కడితో ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. సూర్య అద్భుతంగా, ఎంతో విజ్ఞతతో వ్యవహరించాడని  కొనియాడుతున్నారు. అమెజాన్‌లో లాంగ్వేజ్‌ను ఎంచుకునే అవకాశం ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆ అవకాశం లేదని కొందరు కామెంట్ చేస్తూ సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరైతే ఆ ట్వీట్‌ను లైక్ చేయడం ద్వారా బీజేపీ నేతను సూర్య ట్రోల్ చేశాడని అంటున్నారు. బీజేపీ నేత ట్వీట్ వెనక గల కారణాన్ని ఓసారి పరిశీలిస్తే.. 2019లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (నెప్)ను నటుడు సూర్య తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామీణ విద్యార్థుల భవితను ఇది సర్వనాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యావిధానంపై ప్రతి ఒక్కరూ ఆందోళనంగా, ఆగ్రహంగా, బాధగా ఉన్నారని పేర్కొన్నారు. ''విద్యార్థులకు నాణ్యమైన, సమాన విద్యను అందించడంపై దృష్టిపెట్టకుండా, ప్రవేశ పరీక్షలపై మాత్రమే దృష్టిపెట్టి నూతన విద్యావిధానాన్ని తీసుకురావడంపై ప్రజలు కోపంగా, ఆవేదనగా ఉన్నారు. దేశంలోని 30 కోట్ల మంది గ్రామీణ విద్యార్థులపై ఇది ప్రభావం చూపుతుంది. వారు తరగతులకు ఎలా హాజరవుతారు? అంతెందుకు నా పిల్లలకు మూడో భాషను నేర్పడం నాకే సవాలుగా మారుతుంది'' అని పేర్కొన్నాడు. నాటి సూర్య వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే బీజేపీ నేత ఇప్పుడు ఈ విమర్శలు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)