పేపర్ మిల్లు లో పనిచేస్తూ రాత్రి కాలేజీ లో చదువుకున్నా!

Telugu Lo Computer
0


నటుడు రాజా రవీంద్ర నటుడిగా మాత్రమే కాకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ఉన్నటువంటి పలు సినీ ప్రముఖుల కి మేనేజర్ గా కూడా పని చేసాడు. కాగా తాజాగా నటుడు రాజా రవీంద్ర ఓ పత్రిక ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా తన అసలు పేరు రమేష్ దంతులూరు అని కానీ సినిమా పరిశ్రమలో అప్పటికే ఆ పేరుతో చాలా మంది ఉండటంతో తన పేరు ని రాజా రవీంద్ర గా మార్చుకున్నానని తెలిపాడు. ఇక తనకి సినిమాల్లోకి రాకముందు మార్కెటింగ్ రంగం లో పనిచేయాలని చాలా ఆసక్తిగా ఉండేదని దాంతో తన పెదనాన్న కు సంబంధించిన పేపర్ మిల్లు లో పగలు పని చేసేవాడినని అలాగే కొంత కాలం తర్వాత తన పై చదువులను రాత్రి పూట కాలేజీలో చదివి పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు. ఇక పేపర్ మిల్లులో పని చేసే రోజులలో తన పెదనాన్న తన లో ఉన్నటువంటి డాన్స్ మీద ఆసక్తిని గమనించి చెన్నై కి పంపించి డాన్స్ లో శిక్షణ తీసుకోమని చెప్పాడని దాంతో చెన్నై లో ఉన్నటువంటి ఓ ప్రముఖ శిక్షణ అకాడమీ లో డాన్స్ క్లాసులు వింటూ మంచి పట్టు సాధించానని తెలిపాడు. ఆ తరువాత క్రమక్రమంగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మంచి హోదాను దక్కించుకున్నానని తెలిపాడు. అయితే అప్పట్లో తాను హీరోగా నటించిన మగతృష్ణ అనే చిత్రం సినిమా థియేటర్లలో విడుదల కాలేదని కానీ ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిందని అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా తాను సినిమా ఇండస్ట్రీకి సుపరిచితమయ్యానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం రాజారవీంద్ర తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే అలరిస్తున్నాడు. అంతేకాకుండా తెలుగు ప్రముఖ హీరోలయిన రవి తేజ, నవీన్ చంద్ర, ప్రముఖ సీనియర్ నటి జయసుధ, మరియు ఇతర హీరోలకి మేనేజర్ గా వ్యవహరిస్తూ వారి షూటింగుల డేట్లు మరియు ఇతర వ్యవహారాలను చూసుకుంటూ మేనేజర్ గా పని చేస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)