ఆర్థర్‌కు అరుదైన గౌరవం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 November 2021

ఆర్థర్‌కు అరుదైన గౌరవం


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నియోజకవర్గంలో ఆయన తన వంతుగా సేవలందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కరోనా బాధితులను పరామర్శించడం, సొంత నిధులతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కు​లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ 'సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌' ఇచ్చేందుకు ఆయనను ఎంపిక చేసింది. త్వరలో నందికొట్కూరులో జరగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి సర్టిఫికెట్‌ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. ఆయన సూచనల మేరకు తాను నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్‌ నివారణకు కృషి చేశానన్నారు. అధికారులను సమన్వయం చేస్తూ లాక్‌డౌన్‌ అమలు, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.

No comments:

Post a Comment