'అప్పూ' అడుగుజాడల్లో 'ప్రణీత - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 November 2021

'అప్పూ' అడుగుజాడల్లో 'ప్రణీత


ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న మాటలు అక్షర సత్యం. కోట్ల ఆస్తి ఉన్నా కొందరికి మాత్రమే దయార్ర్ధ హృదయం ఉంటుంది. ఆపన్నులను ఆదుకోవాలనే గొప్ప మనసు ఉంటుంది. అలాంటి వాళ్లు అందర్నీ వీడి త్వరగా వెళ్లిపోతారెందుకో. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తిత్వం ఎందరికి ఉంటుంది. స్టార్ హీరో ఇమేజ్ ని ఏ మాత్రం కనబడనివ్వకుండా.. మరణానంతరం మాత్రమే ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి నలుగురికీ తెలియడం అతడి నిరాడంబర జీవితానికి నిదర్శనం. చేసింది చెప్ప కూడదు, చెప్పింది చేయకూడదు అనే సినిమాల్లో డైలాగులు కాదు, నిజ జీవితంలో చేసి చూపించారు.. అందుకే అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.. సంపాదించిన దాంట్లో కొంతైనా సాయం చేయాలనే స్ఫూర్తిని కొందరిలో అయినా కలిగించారు. ఆ బాటలో ముందు వరుసలో ఉన్న నటి ప్రణీత. అప్పు సర్ నుంచి ఏంతో నేర్చుకున్నానని అంటోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరమైన వారందరికీ పునీత్ సాయమందించారు. వారి విద్య వైద్య ఖర్చులను భరించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొంటూ.. తాను ప్రారంభించిన ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఒకరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలో అంబేద్కర్ భవన్ లో ఈ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.


No comments:

Post a Comment