కలియుగ పాండవులు సినిమా తర్వాత.....!

Telugu Lo Computer
0


కలియుగ పాండవులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మొదటి చిత్రంతో హిట్ అందుకున్నప్పటికీ తర్వాత నుంచి పెద్దగా కల్సి రాలేదు. 1986ఆగస్టు 14న వచ్చిన కలియుగ పాండవులు మూవీ లో హీరోయిన్ గా ఖుష్భు నటించింది. 38సెంటర్స్ లో 50డేస్ ఆడిన ఈ మూవీ కి నంది అవార్డు సైతం వెంకీ గెలిచాడు. అక్కినేని తో కల్సి బ్రహ్మరుద్రులు మూవీలో వెంకీ నటించాడు. 1986నవంబర్ 14న వచ్చిన ఈ మూవీ నిరాశపరిచింది. తర్వాత శోభనతో కల్సి వెంకీ నటించిన అజేయుడు మూవీ కూడా ఫెయిల్ అయింది. 1987మే 7న వచ్చిన ఈ మూవీ ని జి రామ్మోహనరావు తెరకెక్కించాడు. అనంతరం ఖుష్బూ హీరోయిన్ గా నటించిన భారతంలో అర్జునుడు మూవీ 1987మే 29 న వచ్చింది. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లోనే వచ్చిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.ఆ తరువాత త్రిమూర్తులు మూవీ కూడా 1987 మే 29నే వచ్చింది. వెంకీతో కల్సి యాక్షన్ కింగ్ అర్జున్, రాజేంద్ర ప్రసాద్ కల్సి నటించారు. అయితే ఇది కూడా డిజాస్టర్ గా నే మిగిలింది. తర్వాత వచ్చిన మూవీ విజేత విక్రమ్. ఇలా కలియుగ పాండవుల తర్వాత వరుస యాక్షన్ మూవీస్ చేసినా ఏ ఒక్కటీ హిట్ కాలేదు. దాంతో రూటు మార్చేసి, శ్రీనివాస కళ్యాణం పేరిట క్లాసిక్ మూవీ చేసి వెంకీ హిట్ కొట్టాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో 1987సెప్టెంబర్ 25న వచ్చిన ఈ మూవీలో భానుప్రియ, గౌతమి హీరోయిన్స్ . మొత్తం మీద ఆరు సినిమాల తర్వాత హిట్ దక్కించుకున్నాడు వెంకీ.

Post a Comment

0Comments

Post a Comment (0)