పెళ్లి చేసుకున్న మాళవిక సుందర్

Telugu Lo Computer
0


ప్రముఖ నేపద్య గాయని మాళవిక సుందర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త అశ్విన్ కశ్యప్ రఘురామన్‏ను వివాహం చేసుకుంది. మాళవిక కంటే చిన్నవాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మాళవిక దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్‏గా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక. తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడి శ్రోతలను అలరించడమే కాకుండా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ అమ్మడు 200పైగా పాటలు పాడింది. అయితే పెళ్లికి వయసుతో సంబంధం లేదని.. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని.. గౌరవించుకుంటే చాలు అని చెబుతూ.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది మాళవిక.

Post a Comment

0Comments

Post a Comment (0)