సీఎంలందరూ ఒకేలా ఉండరు...!

Telugu Lo Computer
0

 

స్టాలిన్ తాను అధికారం చేపట్టినప్పటి నుంచి ఎవరూ ఊహించిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్ఛర్యపరుస్తున్నారు. తొలుత మాజీ సీఎం ఫొటోలతో ఉన్న స్కూలు బ్యాగులను స్టూడెంట్స్ కి పంపిణీ చేయించారు. ప్రతిపక్ష నేతలకు ప్రాముఖ్యనిస్తూ అన్ని కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేస్తున్నారు. తన తండ్రికి రాజకీయ శత్రువుగా అందరూ భావించే మాజీ సీఎం దివంగత జయలలిత పేరిట నిర్వహించిన అమ్మ క్యాంటీన్లను యధాతధంగా నిర్వహిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా.. సాధారణ వ్యక్తిలా ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తూ ఇతర ముఖ్యమంత్రులకు ఓ సరికొత్త దిశ చూపుతున్నారు. ప్రముఖులు, వీఐపీలు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దన్న రూల్ కూడా విధించారు. దేశంలోనే తనకంటూ ఓ కొత్త ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. తాజాగా సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో వచ్చిన వార్తను చదివి చలించిపోయారు. అంతటితో ఆగకుండా వివక్ష ఎదుర్కొంటున్న ఆ మహిళ ఇంటికి నేరుగా వెళ్లారు. ఇప్పుడీ వార్త తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అశ్వని అనే మహిళ నరిక్కువర కులానికి చెందినది. తమిళనాడులోని మామళ్లాపురం గ్రామంలో ఉంటుంది. అక్కడ స్థల శయన పెరుమాల్ గుడి ఉంటుంది. రాష్ట్రమంతా దాదాపు 750 గుళ్లలో ఉచిత అన్నదానం చేస్తున్నట్టే అక్కడ కూడా చేస్తారు. కానీ, కులం తక్కువదని అశ్వినికి అన్నదానం చేయడానికి నిరాకరించారు. వూరూరా తిరిగి పూసల దండలు అమ్ముకుని బతికే నరక్కువర కులం ఎస్సీ, ఎస్టీల కిందకు రాదు. అట్లా అని బీసీ కూడా కాదు. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాస్ అన్నమాట. అన్నదానం నిరాకరించడంతో అశ్విని గుడి పెద్దలతో గొడవకు దిగింది. ఇది అక్కడ ఉన్న కొంతమంది ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ గా మారి తమిళనాడులో సంచలనం రేపింది. ఈ విషయం ఎమ్మెల్యే, మంత్రుల స్థాయి దాటి ముఖ్యమంత్రి స్టాలిన్ దాకా వెళ్లింది. దీన్ని చూసిన స్టాలిన్ అధికారుల హంగు, ఆర్భాటం లేకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. అశ్వినితోపాటు అదే ఏరియాలో ఉన్న మరికొంతమంది ఇరులార్ కమ్యూనిటీ కుటుంబాలకు ప్రయోజనం కలిగించేలా కొన్ని డెవలప్ మెంట్ పనులకు పథకాలను ప్రకటించాడు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ముద్రా రుణాలు, ఓల్డేజ్ పెన్షన్లు, ఓటర్ ఐడీ కార్డులు, ఎంబీసీ సర్టిఫికెట్లు ఇప్పించాడు. దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పాలకుడు అంటే ఇట్లా ఉండాలి.. ''ఫామ్ హౌజ్ లోనో, నాలుగు గోడల మధ్యనో కూర్చుని జనాలను కలవకుండా పరిపాలించడం కాదు'' అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)