‘‘సినతల్లి’’ పేర బ్యాంకులో రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 15 November 2021

‘‘సినతల్లి’’ పేర బ్యాంకులో రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్

 సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ సినిమా అభిమానుల మన్ననలు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెలెబ్రిటీలందరూ మెచ్చుకుంటూ తమ స్పందనను తెలుపుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే హీరో సూర్యకు ఏకంగా లేఖ రాశారు. రాజకన్ను, పార్వతమ్మ అనే రియల్ పాత్రలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని చూసి చలించిపోయానని తెలిపారు. ‘‘ జై భీమ్ సినిమా చూసి నా హృదయం చలించిపోయింది. పార్వతమ్మ ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురైంది. అందువల్ల సొంత ఖర్చుతో ఆమెకు ఇల్లును కట్టిస్తాను ’’ అని లారెన్స్ చెప్పారు. జై భీమ్ రియల్ సినతల్లి అయిన పార్వతమ్మకు ఆర్థిక సహాయం చేస్తానని హీరో సూర్య వెల్లడించారు. అందుకు అనుగుణంగానే పార్వతమ్మ పేర బ్యాంకులో రూ. 10లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఆమెకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన విషయాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విట్టర్ అకౌంట్‌లో ప్రకటించారు. టీజే. జ్ఞానవేల్ తెరకెక్కించిన జై భీమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  రికార్డులను నెలకొల్పుతోంది. ఐఏమ్‌డీబీలో 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ స్థాయి రికార్డును సృష్టించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, లిజో మోల్ జోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

No comments:

Post a Comment