జొమాటో డెలివరీ బాయ్‌ బైక్‌ చోరీ

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విశ్వాస్(31) జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే పార్సిళ్లు డెలివరీ చేశాక తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దారిలో స్మార్ట్ సిటీ పార్కింగ్ వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతనిని అడ్డుకున్నారు. వారిలోని ఒక యువకుడు తుపాకీ చూపించి.. విశ్వాస్‌ను బైక్ మీద నుంచి దిగాలని బెదిరించాడు. ఇంతలో మరో యువకుడు వచ్చి విశ్వాస్ బైక్‌ను స్టార్ చేశాడు. దీంతో విశ్వాస్‌కు ఆ యువకులకు మధ్య పెనుగులాట జరిగింది. అయితే వారు విశ్వస్‌ను పక్కకు తోసేసి, అతని బైక్ తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. అయితే వారు వచ్చిన బైక్‌ను అక్కడే వదిలివెళ్లపోయారు. వెంటనే విశ్వాస్ పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆగంతకుడు వదిలి వెళ్లిన బైక్‌ను వారు ఎక్కడో చోరీ చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)