సీరియళ్ల లో రొమాంటిక్ సీన్స్ ను నిషేధించిన పాకిస్తాన్

Telugu Lo Computer
0


టీవీ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతర సన్నిహిత దృశ్యాలపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ధారావాహికల్లో అభ్యంతర సన్నివేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. టీవీ సీరియల్లో అభ్యంతరకర సన్నివేశాలపై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుల వస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. సదరు కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని పేర్కొంది. సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం వంటివి.. ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని.. అభ్యంతరకర దృశ్యాలు ఉంటే వెంటనే తొగించాలని ఆదేశాలు జారీచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)