"కంగా"రెత్తించిన భారత మహిళల జట్టు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 October 2021

"కంగా"రెత్తించిన భారత మహిళల జట్టు


ఆస్ట్రేలియా, భారత మహిళల మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును భారత మహిళల జట్టు కంగారెత్తించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 241 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. దాంతో భారత్ కు 136 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3 వికెట్లకు 135 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా 36 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే వారు 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసిన సమయంలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ స్మృతి మందానా (127) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.


No comments:

Post a Comment