వంట నూనె నుంచి బయోడీజిల్ తయారీ... !

Telugu Lo Computer
0


మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన, తాజా ఆహారపదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. నిల్వ ఉంచిన, అంతకుముందే వాడిన పదార్థాల వల్ల ఆరోగ్యానికి ముప్పుతప్పదు. ఇందులో ముఖ్యంగా వంటనూనె. వంట నూనె విషయంలో జాగ్రత్తగా లేకపోతే గుండె , లివర్ జబ్బులతో పాటు క్యాన్సర్  వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో వాడేసిన వంట నూనెలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా వినూత్న పద్ధతిలో బయోడీజల్ తయారు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరతు వంటనూనేను ఎక్కువగా వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాల నుంచి నూనెను సెకరించి బయోడీజిల్ తయారీ ప్లాంట్లకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆధ్వర్యంలో ఇటీవల సదస్సు నిర్వహించారు. ప్రతి రోజూ 50 లీటర్లకు మించి నూనెలను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఇతర ఆహార పదార్ధాల తయారీ సంస్థలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలనిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లవారు ప్రతిరోజూ ఎంత నూనె కొనుక్కున్నారు? ఎంత వినియోగిస్తున్నారనే దానిపై లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అలాగే వాడిన నూనెను ఏం చేస్తున్నారనేది కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రతినెల ఆడిటింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా వంద లీటర్ల నూనెతో వంట చేస్తే 25 లీటర్ల వరకు మిగులుతుందనేది అధికారుల అంచనా. చాలా మంది ఈ నూనెలను డ్రెయిన్లలో పారబోయడం, మంట పుట్టించేందుకు వాడటం, లేదా ప్యాకింగ్ చేసి తోపుడుబండ్ల వారికి విక్రయించడం వంటివి చేస్తుంటారు. దీని వల్ల ప్రజారోగ్యానికి తీవ్రముప్పు వాటిల్లుతోంది.

ఈ సమస్యను గుర్తించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వాడిన వంట నూనెల నుంచి బయోడీజిల్ తయారు చేయించాలని నిర్ణయించింది. దీనికి సంబందించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ సంస్థలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి రుకో (రీయూస్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌) లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ ఉంటేనే వినియోగించిన వంట నూనెను కొనుగోలు చేసే అవకాశముంటుంది. ఇందుకోసం ఇంధన తయారీ సంస్థలు హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద నూనెను సేకరించేందుకు డబ్బాలు ఏర్పాటు చేశారు. అలగే అపార్ట్ మెంట్ల వద్ద కూడా ఈ ఏర్పాటు ఉంటుంది. వంటనూనెల్లో ప్రధానంగా టోటల్‌ పోలార్‌ కాంపౌండ్‌ (టీపీసీ- నూనె నాణ్యత తెలిపే ప్రమాణం) 25 శాతానికి మించకూడదు. తాజా నూనెలో 7శాతం, రెండోసారి వాడితే 15-18, మూడోసారి 24 శాతం ఉంటుంది. 25 శాతం దాటితే ఆ నూనె వినియోగానికి పనికిరాదు ఒకవేళ వినియోగిస్తే ప్రమాదకర జబ్బుల బారిన పడటం ఖాయం. కావున ప్రజలు కూడా వంట నూనెలను ఎక్కువసార్లు వినియోగించకుండా అప్రమత్తం కావాలని.. ఒకవేళ ఎక్కువగా వాడేసిన నూనె ఉంటే మాత్రం బయోడీజిల్ సంస్థలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)