మైనర్ బాలికఫై మైనర్ బాలుడు లైంగిక దాడి !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐఎస్‌ సదన్ డివిజన్‌లో గల బస్తీలో 15 ఏళ్ల బాలిక, వారి ఇంటి ఎదురుగా ఉన్న కుటుంబంలో 16 ఏళ్ల బాలుడు వారి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. రెండు కుటుంబాలు కూలీ పనులుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంట్లోని పెద్దవారు ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లేవారు. ఇంట్లో పిల్లలు ఉండేవాళ్లు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోవటంతో బాలుడు వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోని బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు, బాలిక గుట్టుగా ఉంచారు. శుక్రవారం బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావటంతో బాలికను ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. ఆమె ఉదర భాగం చూసి డాక్టర్లకు అనుమానం వచ్చి పరీక్షలు చేయగా బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలుడిని అదుపులోకి తీసుకుని బాలుర సంరక్షణా కేంద్రానికి తరలించారు. మలక్‌పేట్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)