అమితాబ్ హరివంశ్ బచ్చన్

Telugu Lo Computer
0


అమితాబ్ హరివంశ్ బచ్చన్ 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి  పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి "యాంగ్రీ యంగ్ మాన్"గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే  బిరుదులను  కూడా పొందారు. నాలుగు  దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పని చేశారు ఆయన. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు. 1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని "ఒన్ మాన్ ఇండస్ట్రీ"గా అభివర్ణించారు. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు.  ఉత్తమ నటుడు కేటగిరీకిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక, నేపధ్య గాయకుడుగా, నిర్మాతగా, యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు. 1980లలో రాజకీయాలలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు అమితాబ్. 1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హానర్"తో గౌరవించింది. హాలీవుడ్ లో మొదటిసారి 2013లో "ది గ్రేట్ గేట్స్బే" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. జ్యియిష్ వ్యక్తి మేయర్ వోల్ఫ్ షిం అనే పాత్రలో నటించారయన. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్లో జన్మించారు. వీరి పూర్వీకులు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ జిల్లా, రాణీగంజ్ తాలూకా బబుపట్టి గ్రామానికి చెందినవారు. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ శ్రీవాస్తవ (బచ్చన్) హిందీ కవి. ఆయన తల్లి తేజి బచ్చన్ పంజాబీ సిక్కు. ఆమెది పంజాబ్ రాష్ట్రంలోని లయల్ పూర్  పట్టణం. అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదానికి ఆకర్షితులైన హరివంశ్ అమితాబ్ కు ఆ పేరు పెట్టారు. ఈ నినాదానికి తెలుగులో "విప్లవం వర్ధిల్లాలి "అనే అర్ధం. తన స్నేహితుడు, కవి అయిన సుమిత్రానందన్ పంత్  సూచన మేరకు అమితాబ్ అని తిరిగి పేరు మార్చారు హరివంశ్. అమితాబ్ ఇంటిపేరు శ్రీవాస్తవ అయినా, హరివంశ్ కలం పేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా మారింది. అమితాబ్ తండ్రి 2003లో, తల్లి 2007లో చనిపోయారు.  నైనిటేల్ లోని షేర్ వుడ్ కళాశాలకు అమితాబ్ పూర్వ విద్యార్థి. తరువాత దిల్లీ విశ్వవిద్యాలయానికీ చెందిన కిరోరిమల్ కళాశాలలో చదువుకున్నారు. ఆయన తమ్ముడు పేరు అజితాబ్. అమితాబ్ తల్లికి నటన అంటే ఇష్టం. ఆమె నాటకాల్లో నటించేవారు. ఆమెకు ఒక సినిమా అవకాశం కూడా వచ్చింది. కానీ ఆమె గృహిణిగా ఉండటానికే ఇష్టపడ్డారు. అమితాబ్ కు సినిమాలపై ఆసక్తి కలగడానికి ఆయన తల్లి తేజీ ప్రోత్సాహం చాలా ఉంది. అమితాబ్ తన సహ నటి జయ బచ్చన్ ను పెళ్ళి చేసుకున్నారు.  వీరికి ఇద్దరు  పిల్లలు శ్వేత నందా, అభిషేక్ బచ్చన్. అమితాబ్ 1969లో భువన్ షోం అనే సినిమాలో నేపథ్య కథకునిగా మొదటి సారి పరిచయం అయ్యారు. మృణాల్ సేన్ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. నటునిగా మాత్రం సాత్ హిందుస్తానీ ఆయన మొదటి సినిమా. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏడుగురు ప్రధానపాత్రల్లో ఒకరిగా చేశారు అమితాబ్. రెండో సినిమా ఆనంద్ (1971) లో రాజేష్ ఖన్నాతో కలసి చేసిన అమితాబ్ ఆ సినిమాలో వైద్యునిగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకుగానూ ఉత్తమ సహాయనటునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత పర్వానా (1971) సినిమాలో మొదటిసారిగా ప్రతి నాయకునిగా నటించారు. ఈ సినిమా తరువాత రేష్మా ఔర్ షేరా (1971) లో కూడా విలన్ పాత్రే పోషించారు. ఈ సమయంలోనే గుడ్దీ సినిమాలో అతిథిపాత్రలో నటించారు. బావర్చి సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశారు. 1972లో ఎస్.రామనాధన్ దర్శకత్వం వహించిన బాంబే టు గోవా సినిమాలో నటించారు. అమితాబ్, భార్య జయ బచ్చన్. 1973లో జంజిర్ సినిమా తరువాత వీరు పెళ్ళి చేసుకున్నారు. అప్పటి దాకా రొమాంటిక్ హీరోగా కొనసాగుతున్న అమితాబ్ ను డైరక్టర్ ప్రకాశ్ మెహ్రా  జంజిర్ (1973) లో విజయ్ ఖన్నా పాత్రలో యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ ఇండియాగా కొత్త పర్సోనా నిర్మించారు. ఫిలింఫేర్ అమితాబ్ పెర్ఫార్మెన్సెస్ ను ఐకానిక్ గా అభివర్ణించింది. ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమానే కాదు, అమితాబ్ ను స్టార్ ను చేసిన సినిమా కూడా. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ  నటునిగా మొట్టమొదటి అవార్డు అందుకున్నారు. 1973లో విడుదలైన జంజీర్ లోనే కాక వారి వివాహం తరువాత అభిమాన్ వంటి చాలా సినిమాల్లో జయ, అమితాబ్ జంటగా తెరపై కనిపించారు.  అభిమాన్ వారి వివాహం అయిన నెల తరువాత విడుదలై విజయం  సాధించింది. మరొకసారి రాజేష్ ఖన్నాతో నమక్ హరామ్ సినిమాలో  విక్రమ్ పాత్రలో కనిపించిన అమితాబ్ ఉత్తమ సహాయనటునిగా రెండో ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, బీరేశ్ చటర్జీ స్క్రిప్ట్ అందించారు.1974లో అమితాబ్ కుంవారా బాప్, దోస్త్ వంటి సినిమాలలో అతిథిపాత్రలు పోషించారు. రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలో సహాయ నటుని పాత్ర కూడా వేశారు అమితాబ్. నిజాయితీ, ఆర్థిక అసమానతల అణచివేత ముఖ్యాంశంగా వచ్చిన ఈ సినిమాను మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1974లో అతి ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఇది. 1974 డిసెంబరు 6న విడుదలైన మజ్బూర్  సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించారు. హాలివుడ్ సినిమా జిగ్ జాగ్ కు రీమేక్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్. 1975లో వివిధ రకాలైన జోనర్ లలో సినిమాలు చేశారు బచ్చన్. చుప్కే చుప్కే కామెడీ, ఫరార్ క్రైం డ్రామా, మిలీ రొమాంటిక్ డ్రామా లతో అమితాబ్ అలరించారు. 1975 బాలీవుడ్ చరిత్రలోనూ, అమితాబ్ కెరీర్ లోనూ అత్యంత భారీ హిట్లను అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన దీవార్, షోలే సినిమాలు భారతీయ సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ మలుపు. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన దీవార్ సినిమాలో శశికపూర్, నిరూపా రాయ్, నీతూ సింగ్ లతో నటించారు అమితాబ్. ఈ సినిమాలోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారాయన. బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద హిట్ గా నిలిచిందీ చిత్రం. ఇండియా టైంస్ ఈ సినిమాను తప్పక చూడాల్సిన బాలీవుడ్ 25 చిత్రాల జాబితాలో ఒకటిగా పేర్కొంది. ఆగస్టు 15న విడుదలైన షోలే సినిమా 1975 సంవత్సరానికే కాక, మొత్తం భారతదేశంలోనే అతి ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2, 364, 500, 000 రూపాయలు (60 మిలియన్ డాలర్లు) వసూలు చేసిందీ సినిమా. ఈ సినిమాలో అమితాబ్ జయ్ దేవ్ పాత్రలో కనిపించారు. 1999లో బిబిసి ఇండియా ఈ సినిమాను "ఫిలిం ఆఫ్ ద మిలీనియం" గానూ, ఇండియా టైంస్ తప్పక చూడాల్సిన 25 బాలీవుడ్ సినిమాల జాబితాలో చేర్చింది. అదే సంవత్సరంలో ఫిలింఫేర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా షోలే సినిమాకు ఫిలింఫేర్ బెస్ట్ ఫిలిం ఆఫ్ 50 ఇయర్స్ అవార్డు ఇచ్చింది.

1976లో, యశ్ చోప్రా దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ కభీ కభీతో ఎటువంటి పాత్రలైన చేయగలనని నిరూపించుకున్నారు అమితాబ్. ఈ సినిమాలో యువకవి అమిత్ మల్హోత్రా పాత్రలో కనిపించారాయన. అప్పటిదాకా వచ్చిన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఉండి, రొమాంటిక్ హీరోగా నటించిన అమితాబ్ కు ప్రేక్షకుల నుండే కాక, విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమకు గాను ఆయనను ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డుకు నామినేషన్ లభించింది. అదే సంవత్సరంలో అదాలత్ అనే సినిమాలో తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు అమితాబ్. 1977లో అమర్ అక్బర్ ఆంతోనియా సినిమాలోని ఆంతోనియా పాత్రలో అయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో వినోద్ ఖన్నా, రిషికపూర్ లతో కలసి నటించారాయన. ఆ సంవత్సరంలో ఈ సినిమా అత్యధిక వసూళ్ళు గెలిచింది. అదే సంవత్సరంలో పర్వరిష్, ఖూన్ పసీనా వంటి హిట్ సినిమాల్లో కూడా నటించారు.1978లో కసమే వాదే, డాన్ సినిమాలలో మళ్ళీ ద్విపాత్రాభినయం చేశారు అమితాబ్. కసమే వాదేలో అమిత్, శంకర్ పాత్రలు, డాన్ సినిమాలో అండర్ వరల్డ్ గ్యాంగ్ లీడర్, విజయ్ పాత్రలు నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్నారు అమితాబ్. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన త్రిశూల్, ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన మక్దూర్ కా సికిందర్ సినిమాలలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుని నామినేషన్లు లభించాయి.
1979లో అమితాబ్ సుహాగ్ సినిమాలో నటించారు. ఆ సంవత్సరానికి ఆ సినిమా అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించింది. అదే సంవత్సరంలో ఆయన చేసిన మిస్టర్.నట్వర్ లాల్, కాలా పత్తర్, ది గ్రేట్ గేంబ్లర్ సినిమాలు కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు, విమర్శకల ప్రశంసలు కూడా పొందారు. నటి రేఖ తో కలసి ఆయన చేసిన మిస్టర్. నట్వర్ లాల్ సినిమాలో మొదటిసారి గాయకుని అవతారం ఎత్తారు అమితాబ్. ఈ సినిమాకి గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరిల్లో నామినేషన్లు లభించాయి. కాలా పత్తర్ కు కూడా ఉత్తమ నటుని నామినేషన్ వచ్చింది. 1980లో రాజ్ కోస్లా దర్శకత్వం వహించిన దోస్తానా సినిమాలో శతృజ్ఞ సిన్హా, జీనత్ అమన్ లతో కలసి నటించిన అమితాబ్ ఆ చిత్రంలోని నటనకు కూడా ఉత్తమ నటుని నామినేషన్ దక్కించుకున్నారు. ఈ సినిమా 1980లో అతి ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రం. 1981లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన సిల్ సిలా సినిమాలో తన భార్య జయ, రేఖ లతో కలసి నటించారు. 80లలో షాన్ (1980), శక్తి (1982) సినిమాలు నిరాశ మిగిల్చినా, రాం బలరాం (1980), నసీబ్ (1981), లారిస్ (1981) సినిమాలు హిట్ అయ్యాయి[34]. 1982లో ఆయన చేసిన రెండు ద్విపాత్రాభినయ సినిమాలు సత్తే పే సత్తే, దేశ్ ప్రేమ్ విజయం సాధించాయి. 1983లో మహాన్ చిత్రంలో త్రిపాత్రాభినయం కూడా చేశారు అమితాబ్. 1983లో ఆయన నటించిన కూలీ సినిమా ఆ సంవత్సరంలోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)