ఎస్ సీ ఆర్ దసరా స్పెషల్ ట్రైన్స్‌

Telugu Lo Computer
0

 


దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 22 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వివరాలను ఎస్సీఆర్ అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్‌, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? తదితర వివరాలను సదరు ట్వీట్లో వెల్లడించరు. గతేడాది లాక్‌డౌన్‌ తరువాత రైల్వేలు పూర్తిస్థాయిలో రైలు సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. రెగ్యులర్‌ సర్వీసులనే స్పెషల్ సర్వీసులుగా నడిపిస్తున్నది. సికింద్రాబాద్‌-నర్సాపూర్ రైలు గురువారం రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్ రైలు గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌-విశాఖపట్నం రైలు గురువారం రాత్రి 7.40 గంటలకు బయలుదేరుతుంది. పండుగ తర్వాత కూడా పలు సర్వీసులను నడుపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)