ఓర్వలేక విపక్షాలు కుట్ర చేస్తున్నాయి : జగన్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. నిన్నముఖ్యమంత్రి  జగన్‌పై పట్టాభి బూతులు తిట్టడం, ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అటు వైసీపీ కూడా టీడీపీ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలపై సీఎం జగన్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును ఓర్వలేక విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు జగన్. ఎవరెన్ని చేసినా ప్రజల కోసం తమ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ''మాపై ప్రజలు చూపిస్తున్న ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారు. ఓ వర్గం మీడియా కూడా తట్టుకోలేకపోతోంది. మంచి పనులను ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేదలకు మేలు జరిగితే జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కుట్రలు చేస్తున్నారు. నన్ను కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. గతంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి బూతులు మాట్లడలేదు. ఆ బూతులు విని కొందరు మా అభిమానులు, కార్యర్తలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు అవే కారణం. టీడీపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చులుపెడుతున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పేదలు మంచి చేస్తూనే ఉంటాం.'' అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)