ఆంధ్రప్రదేశ్ కు జీఎస్టీ నిధులు విడుదల

Telugu Lo Computer
0



ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత మేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం తో నిధులు సమకూరనున్నాయి. కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రూ.44 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. అందులో భాగంగా.. తెలంగాణకు రూ.1,264 కోట్లు , ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు విడుదల అయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్ట్రాలకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు, తెలంగాణకు రూ.1,264.78 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం రూ.1.59 లక్షల కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించినట్లైందని పేర్కొంది. ఇందులో ఏపీకి రూ.3,272.19 కోట్లు, తెలంగాణకు రూ.4,569.49 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆదాయనష్ట భర్తీ కోసం జులై 15న రూ.75వేల కోట్లు, అక్టోబరు 7న రూ.40వేల కోట్లు, ఇప్పుడు రూ.44వేల కోట్లు విడుదల చేసినట్లు గుర్తుచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)