ఓట్లు ఎన్నిరకాలు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 October 2021

ఓట్లు ఎన్నిరకాలు ?



సాధారణ ఓటు : 18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్‌ జరుగుతుంది.

టెండర్‌ ఓటు : ఓటరు జాబితాలో పేరుండి పోలింగ్‌ కేంద్రం వద్దకు పోయేసరికి తమ ఓటును ఇంకొకరు వేశారనుకోండి, ఆ తర్వాత అసలైన ఓటరు వస్తే.. టెండరు ఓటు వేసే అవకాశం ఉంది. దీనిని టెండరు ఓటు అంటారు.

సర్వీస్‌ ఓటు: సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్‌ ఓటు వేసే అవకాశం కల్పించింది.

ప్రాక్సీ ఓటు: తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టు ద్వారా తాము వేయదలుచుకున్న అభ్యర్థికి ఎన్నికల సిబ్బంది ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ పద్దతిలో ఓటు వినియోగించుకోవడాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ అంటారు.

No comments:

Post a Comment