వారంలో మూడు రోజులు పనిచేస్తే సరిపోతుంది...!

Telugu Lo Computer
0



ఫిన్‌టెక్‌ కంపెనీ తమ కంపెనీలో వారంలో మూడు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయని ప్రకటించింది. అలాగని జీతంలో కోతేమి విధించడం లేదు. మార్కెట్‌ రేటులో 80% జీతంగా చెల్లించేందుకు సిద్ధమని స్లైస్‌ ప్రకటించింది. ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో ఉద్యోగులు తమ ఆసక్తులు, అభిరుచులను కొనసాగించుకునే వీలుంటుందని కంపెనీ చెప్తోంది. భవిష్యత్‌లో పని విధానమంతా ఇలాగే ఉంటుందని, ఒకే ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని ఎవరు కోరుకోవడం లేదని స్లైస్‌ వ్యవస్థాపడు,28 ఏళ్ల యువ ఎంటర్‌ప్రెన్యూర్‌ రాజన్‌ బజాజ్‌ అంటున్నారు. టాలెంట్‌ హంట్‌లో భిన్నంగా నిలిచేందుకు స్లైస్‌ మూడు రోజుల పని విధానాన్ని ఎంచుకుంది.ఈ సంస్థలో ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 1,000 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను నియమించే ఆలోచనలోఈ కంపెనీ ఉంది.మూడు రోజుల పనితోనూ ఉద్యోగులు పూర్తి ప్రయోజనాలు, పూర్తిజీతం పొందవచ్చు. మిగిలిన సమయంలో కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు లేదా స్టార్టప్​ సంస్థను నెలకొల్పవచ్చని, కో-ఫౌండర్‌ను అన్వేషించుకోవచ్చని రాజన్‌ సూచిస్తున్నారు.  తక్కువ పనిదినాలు అనే కాన్సెప్ట్‌ గడిచిన శతాబ్ద కాలంగా ఉంది. 1926లో మొదటిసారి హెన్రీ ఫోర్డ్ ఐదు రోజుల పని దినాల సంస్కృతి ప్రవేశపెట్టారు. అలా పనిదినాలు తగ్గించడం వలన ఉత్పాదకతలో తరుగుదల ఏమైనా ఉంటుందా అని రకరకాల ప్రయోగాలు చేశారు. చాలా దేశాలు, చాలా కంపెనీలు సంవత్సరాల తరబడి నాలుగు రోజుల పనిదినాలపై ప్రయోగాలు చేశాయి. తక్కువ పని రోజుల కారణంగా ఉద్యోగి ఉత్పాదకత పెరుగుతోందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ తరహా విధానానికి ఐర్‌ల్యాండ్‌, ఐస్‌ల్యాండ్‌ వంటి దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఎంపిక చేసిన కొందరు ఉద్యోగులకు నాలుగు రోజుల పని విధానాన్ని 2018 నుంచి అమెజాన్‌ (Amazon) అమలు చేస్తోంది. పని గంటలు తగ్గించేందుకు అటు చైనా (China) కూడా ప్రయత్నాలు చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)