దేశాధ్యక్షుడికి నో ఎంట్రీ

Telugu Lo Computer
0



ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు చేదు అనుభవం ఎదురైయింది  కరోనా మహమ్మారి నియంత్రణకై వ్యాక్సినేషన్ నిబంధన అమల్లో ఉంది. వ్యాక్సిన్ చేయించుకోకపోతే నో ఎంట్రీ నిబంధనను కచ్చితంగా పాటిస్తున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో వెళ్లారు. అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో హోటల్ యాజమాన్యం ఆయన్ని లోపలకు అనుమతివ్వలేదు. దాంతో చేసేదేమీలేక.. నిస్సహాయంగా బయటికొచ్చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు అతని ఇద్దరు కేబినెట్ మంత్రులు. రోడ్డు పక్కనే నిల్చుని పిజ్జా తిన్నారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ హోటల్ సమీపంలోని ఓ వీధిలో పిజ్జా తినడమంటే తమ నాయకుడి సింప్లిసిటీకు నిదర్శనమని బోల్సొనారో మద్దతుదారులు కామెంట్లు పెడుతున్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యేముందు వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలనే నిబంధన ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)