భీమ్లా నాయక్‌ వచ్చేశాడు..!

Telugu Lo Computer
0


పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'భీమ్లానాయక్‌' నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. గురువారం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. 'సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు' అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. 'భీమ్లానాయక్' టైటిల్‌ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బీజుమేనన్‌ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పాత్రను రానా పోషిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్‌, నిత్యామేనన్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)