చెక్ బౌన్సయితే ఫైన్‌...!

Telugu Lo Computer
0


మీరు ఎవరికైనా ఆర్థిక లావాదేవీల కోసం చెక్ ఇచ్చారా? అయితే, మీ బ్యాంక్ ఖాతాలో సదరు చెక్‌పై రాసిన మొత్తాని కంటే నగదు నిల్వలు తగ్గకుండా చూసుకోండి. ఎందుకంటే గతంలో మీరు జారీ చేసిన చెక్ గానీ, ఇతరులకు మీరిచ్చిన చెక్ గానీ బ్యాంకులో వేస్తే క్లియర్ కావడానికి ఎక్కువ టైం తీసుకోవడం లేదు. ఎందుకంటే వారాంతపు సెలవులు, ఇతర సెలవు దినాల్లోనూ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్‌) సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారీ మొత్తంలో నగదు చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో రూపొందించిన పేమెంట్స్ సిస్టం నాచ్‌. కరోనా టైంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద నగదు బదిలీకి నాచ్ వ్యవస్థను ఉపయోగించుకున్నది కేంద్రం. ఇంతకుముందు వారాంతంలో అంటే ఆదివారాలు సెలవు. కానీ ఇప్పుడు ఆ చాన్స్‌ లేదు. ఒకవేళ మీ ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. అదే జరిగితే మీరు జరిమానా చెల్లించాలి. అంతే కాదు నాచ్ సేవలను అందుబాటులోకి తేవడంతో ఇతర ఆర్థిక సేవలు పూర్తి చేసుకోవడానికి కస్టమర్లకు వెసులుబాటుగా ఉంటుంది. నాచ్ సేవలు ప్రతిరోజూ అందుబాటులో ఉండటంతో సెలవు దినాల్లో వాటర్‌, ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, ఫోన్‌, రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు, బీమా ప్రీమియం చెల్లింపులు గడువు లోపే పూర్తి చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)