పెదాలు తాజాగా కనిపించాలంటే...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 September 2021

పెదాలు తాజాగా కనిపించాలంటే...!


శీతాకాలంలో మనలో చాలా మంది పెదాలు పొడిబారిపోతూ ఉంటాయి. ఈ కారణంగా కొందరికి లిప్ స్టిక్ వేసుకోవాలనిపించదు.  మన మొఖం అందంగా కనిపించాలంటే.. మాత్రం పెదాలు అందంగా మెరిసిపోవాలి. శీతాకాలంలో మీ పెదవులు పొడిబారకుండా.. రోజంతా మెరుస్తూ ఉండేందుకు పాటించాల్సిన చిట్కాలు : మీ పెదవులు ఎల్లప్పుడూ తాజాగా కనిపించాలంటే.. మాయిశ్చరైజర్ చేయడం చాలా అవసరం. అందుకోసం చాలా మంది అమ్మాయిలు కచ్చితంగా లిప్ బామ్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని ఎల్లప్పుడూ తమ వెంటే తీసుకెళ్తారు. పెదాలు డ్రై అయిన ప్రతిసారీ వీటిని అప్లై చేసుకొంటూ ఉంటారు. అయితే బ్యూటీ కిట్ లో భాగమైన దీన్ని మార్కెట్లో కొనడం కంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్లో పెదాల అందాన్ని మరింత పెంచే లిప్ బామ్ ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సిన వస్తువులన్నీ కిరాణ షాపుల్లో.. సూపర్ మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఇందుకోసం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ముందుగా డబుల్ బాయిలర్లో టేబుల్ స్పూన్ షియా, కొకొవా బటర్ తీసుకోవాలి. మంటను చిన్నగా పెట్టి 20 నిమిషాల పాటు వేడి చేయాలి.  టీ స్పూన్ కొబ్బరినూనె, కొద్దిగా బీస్ వ్యాక్స్ కూడా కలపాలి. ఇవన్నీ బాగా కలిసి ఓ మిశ్రమంలా తయారయ్యేలా టూత్ పిక్ తో కలపాలి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత.. రెండు చుక్కల తేనే, కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్, కొద్దిగా కొకొవా పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ ఖాళీ పాత్రలో లేదా లిప్ స్టిక్ ట్యూబ్ వేసిన తర్వాత సుమారు 3 నుండి 4 గంటల వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మీరు కోరుకున్న చాకో మింట్ లిప్ బామ్ రెడీ అయిపోతుంది. మీ పెదాలు తరచుగా పొడిబారుతూ ఉంటే.. రాత్రి ఇంట్లో నిద్రించే ముందు తగినంత వెన్నలో అయిదారు చుక్కల తేనే కలిపి మీ పెదాలపై రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ లిప్స్ చాలా సాఫ్ట్ గా మారిపోతాయి.

No comments:

Post a Comment