ఇండియన్ కంపెనీ కోసం క్యూ!

Telugu Lo Computer
0

 

ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కంపెనీల తరువాత నాస్​డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్లో మరో భారతీయ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ లిస్టింగ్‌ చేయబడిన విషయం తెలిసిందే. ఫ్రెష్‌వర్క్‌ లిస్టింగ్‌ ఐనా ఒక్కరోజులోనే కంపెనీ షేర్లు ఏకంగా 32 శాతం మేర ఎగబాకాయి. కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 13 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతేకాకుండా ఒక్కరోజులోనే కంపెనీకి చెందిన 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులైనారని ఫ్రెష్‌వర్స్క్‌ వ్యవస్థాపకుడు గిరీష్‌ మాతృబూతం వెల్లడించిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు నాస్‌డాక్‌ స్టాక్‌ఎక్సేచేంజ్‌ ముగిసే సమయానికి ఫ్రెష్‌వర్క్స్‌ 46.75 డాలర్ల వద్ద స్దిరపడింది. తాజాగా పలు భారతీయ ఇన్వెస్టర్లు ఫ్రెష్‌వర్క్స్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఊవిళ్లురుతున్నారు. మైక్రోసాఫ్ట్‌ పొందిన ఆదరణను ఇప్పుడు ఫ్రెష్‌వర్క్స్‌ పొందుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా-లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులను సులభతరం చేసే బ్రోకర్లు చెప్పిన దాని ప్రకారం గత కొన్ని రోజులుగా ఫ్రెష్‌వర్క్స్‌ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారని పేర్కొంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ వెస్ట్‌ఫైనాన్స్‌ డేటా ప్రకారం.. ఫ్రెష్‌వర్క్స్ ఇంక్. స్టాక్ దాని ఐపిఒ తర్వాత పెట్టుబడిదారుల అగ్ర ఎంపికగా నిలిచిందని, అంతేకాకుండా ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందినట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)