తగ్గిన సింగపూర్‌ జనాభా

Telugu Lo Computer
0


2020లో 56.90 లక్షలున్న జనాభా ఈ ఏడాది జూన్‌లో 54.50 లక్షలకు పడిపోయింది. 1970లో ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించడం మొదలు పెట్టిన తరవాత ఎన్నడూ ఇంతగా జనాభా క్షీణించలేదు. చాలామంది సింగపూర్‌ పౌరులు, శాశ్వత నివాస హోదా (పీఆర్‌) గల విదేశీయులు పనుల మీద ఇతర దేశాలకు వెళ్లి, కొవిడ్‌ ఆంక్షల వల్ల తిరిగి రాలేక ఏడాది కాలంగా బయటే ఉండిపోవడం దీనికి మూల కారణం. సింగపూర్‌లో ఉన్నవారు కూడా.. కొవిడ్‌ నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు. దీనివల్ల కొత్తగా పౌరసత్వం కానీ, పీఆర్‌ హోదా కానీ పొందడం ఆలస్యమవుతోంది. వివిధ పనులు పనిచేయడానికి ఇతర దేశాల వారు సకాలంలో పర్మిట్లు పొందలేకపోతున్నారు. సింగపూర్‌ జనాభాలో రానురానూ వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే, జననాల రేటు పడిపోతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)