హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 6 September 2021

హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్


తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి.  కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుండి 8గంటల వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రెండు గంటల పాటు కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, నాలాల చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు మరీ అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం ఇలాగే మరో 8 గంటల పాటు కురిసే అవకాశముందని పేర్కొంది.  ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్పా జనం ఇళ్ల నుండి బయటకు రావొద్దని కోరారు. బయట ఉన్నవారు త్వరగా ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. సహాయం కోసం 040- 2955 5500లో సంప్రదించాలని ​తెలిపారు.

No comments:

Post a Comment