పారాలింపిక్స్‌ పతక విజేతలకు అభినందన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 September 2021

పారాలింపిక్స్‌ పతక విజేతలకు అభినందన


టోక్యో పారాలింపిక్స్‌ లో మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతక విజేత మనీష్ నర్వాల్ , రజత పతక విజేత సింఘ్రాజ్ అధనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖారాను అభినందించిన గవర్నర్ ఆమె ఇప్పటికే ఒక బంగారు పతకాన్ని సాధించారని ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారని గవర్నర్ పేర్కొన్నారు. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్‌ను కూడా గవర్నర్‌ బిశ్వ భూషణ్ అభినందించారు. దేశ ప్రజలు వారి విజయాలను చూసి గర్వపడుతున్నారని, భవిష్యత్తులో దేశానికి మరిన్ని పురస్కారాలు అందించేదుకు కృషి చేయాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

No comments:

Post a Comment