తాటి చెట్టు...!

Telugu Lo Computer
0


తాటి చెట్టు ఒక కల్పవృక్షం. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వేసవి పూర్తయే సమయానికి చేతికొచ్చే తాటి పండు గుజ్జుతో బూరెలు, రొట్టెలు చేసుకొని ఇష్టంగా తింటారు  తెలుగువారు.తాటితాన్ద్ర అంటే కూడా మనవాళ్లకు ప్రీతే. తాటిపండుతో సామాన్యులు యిలా తినుబండారాలు చేసుకుంటే, కవులు మాత్రం పద్యపాకం చేసి దానికి సాహిత్య రుచి జోడించారు.  శ్రీనాథుడి భీమేశ్వరపురాణం, భీమఖండం కథనంలో వ్యాసుడు గంగానదీ తీరాన విహరిస్తూ, దాక్షారామం విశిష్టతను శిషులతో చెప్తుంటాడు. ఇంతలో సూర్యాస్తమయ మవుతుంది.అప్పుడు శ్రీనాథుడేమంటాడంటే 

     సంజకెంపును దిమరంజ౦పు  నలుపు 

     గమిచ్చి బ్రహ్మా౦డ భా౦డంబు గరం మెఱసె

     పరమ పరిపాక దశవృంత  బంధ మెడలి 

     పతనమగు తాటి పండుతో బ్రతి ఘటించి

తాటిపండు కనిపిస్తే తినడం మానేసి, తొడిమ దగ్గర వున్న ఎరుపు రంగును సాయంసంజ వేళ అరుణవర్ణంతో పోల్చాడు. దానిపైవున్న నలుపును రాబోయే చీకటిగా వర్ణించాడు. తాటిపండు మధ్యభాగంలో అక్కడక్కడా సన్నగా చీలిపోయి లోపలి బాగా కనిపిస్తుంటే 

సూర్య కిరణ పుంజాలు వెలువడుతున్నట్టు తోచాయి శ్రీనాథుడికి.ఆయనకీ తాటిపండంటే యిష్టం కాబోలు. అందుకే ఇలాంటి వూహ సాధ్యపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)