మెట్రో పిల్లర్‎ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 September 2021

మెట్రో పిల్లర్‎ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

 

సికింద్రాబాద్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కంటోన్మెంట్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు (బి 956) మెట్రో పిల్లర్‎ను అదుపు తప్పి ఢీకొట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ మొదటి ట్రిప్ పూర్తి చేసి రెండవ ట్రిప్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ కుడి చేతికి తిమ్మిర్లు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. అంబులెన్స్ సహాయంతో డ్రైవర్‎ని ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment