వంద బంగారు నాణేలు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 3 September 2021

వంద బంగారు నాణేలు!


పూర్వం మాలిక్ ఇబ్రహీం అనే తురుష్క ప్రభువు వుండేవాడు. అతను పండిత కవి పోషకుడు, ప్రజలను  కన్న బిడ్డలుగా చూసుకునేవాడు. ఆయనను ప్రజలంతా మల్కిభరాముడు. యిభారాముడు అని పిలుస్తుండేవారు. విజయవాడ దగ్గరి ఇబ్రహీం పట్నం ఆయన పేరు మీదే నిర్మించారని చెప్తారు. కవులు ఆయన్ను పొగుడుతూ చాలా పద్యాలు వ్రాశారు. పక్కన మొహమ్మద్ భేక్ అనే సుబేదారు వుండే వాడు. అతనికి అందరూ మాలిక్ ఇబ్రహీం ని పొగుడు తారే అని అసూయగా వుండేది.ఆయన ఒకరోజు తన కొలువులోని పండితులను తనను పొగుడుతూ పద్యము చెప్పే వారికి 100 బంగారు కాసులు యిస్తానని ప్రకటించాడు.అతనిలో పొగడదగ్గ గునాలేవీ లేవు యేమని పోగాదాలో తెలియక సభలో పండితులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఒక పండితుడికి ఏదో స్ఫురించింది. అతను పోతన  భాగవతం లోని అడవి వర్ణన పద్యం కాస్త మార్చి చదివాడు. 

భిల్లీ భల్లు లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ 

ఝిల్లీ హరి శరభక కరి కిరి మల్లాద్భుత కాక ఘూక మాయమగు నడవిన్ 

అర్థము:-- భిల్లులు (కోయవాళ్ళు)అడవి ఎనుబోతులు, ఎలుగు బంట్లు, పాములు, ఖడ్గ మృగాలు, ముడుతలు పడిన ముఖము గల సవరపు మృగములు, యీల పురుగులు, సింహాలు,కుందేళ్ళు. అడవి పందులు, కాకులు, గుడ్లగూబలు నిండిన అడవి నందు. అని అడవి వర్ణన 

ఈ పద్యం చివర కొంచెం మార్చి"కాక ఘూక మహమ్మదు భేక" అని చదివాడట. అదేదో పొగడ్త అనుకోని సెహభాష్! అని మెచ్చుకొని వంద బంగారు నాణాలు ఇమ్మని చెప్పాడట. యిలా అంత ధనం యివ్వడం  యిష్టం లేని ఒక మహమ్మదీయుడు లేచి సుల్తాన్ యితడు మిమ్మల్ని ఘూఖా అన్నాడు.( 'ఘూ' అంటే వారి భాషలో అమేధ్యం అని అర్థం). వెంటనే ఆ కవి సుల్తాన్ నేను 'ఘూఖా'అనలేదు 'ఘీఖా' అన్నాను మీరు పొరబాటున విన్నట్టున్నారు. అని తెలివిగా సవరించుకుని . వంద బంగారు నాణాలు పట్టుకొని వెళ్ళిపోయాడట. .

No comments:

Post a Comment