కృష్ణానదికి భారీ వరద

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తక్కువ ఎత్తులో పశ్చిమ, నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి  వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు బలహీనపడడంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఎండ తీవ్రత కనిపించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఓ వైపు మధ్యాహ్నం భానుడు భగభగ అంటుంటే.. కాసేపటికే మళ్లీ వాతావరణం మారి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. కృష్ణానదిపై ఉన్న బహుళార్ధసాధక ప్రాజెక్టు శ్రీశైలం 10 అడుగుల మేర 7 ఏడు గేట్లు ఎత్తి నీటిని  దిగువకు వదులుతున్నారు.   శ్రీశైలం జలాశయానికి 2,04,279 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా, 2,54,778 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీ (TMC)లు కాగా ప్రస్తుతం 214.3637 గా నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్‌ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరిచారు. డ్యామ్‌ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)