శంషాబాద్‌-కొలంబో విమాన సర్వీసు

Telugu Lo Computer
0


కరోనా తీవ్రత తగ్గడంతో ఒక్కొక్కటిగా అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభమవుతు న్నాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీలంక రాజధాని కొలంబోకు జీఎంఆర్‌, శ్రీలంక అధికారులు శుక్రవారం విమాన సర్వీసు ప్రారంభించారు. 18 నెలల తరువాత కొలంబోకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.55 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 120 మంది ప్రయాణికులతో మొదటి విమానం బయలుదేరి వెళ్లింది. శంషాబాద్‌-కొలంబో మధ్య వారానికి రెండు సార్లు సోమవారం, శుక్రవారం సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ నుంచి పెద్దఎత్తున్న ప్రయాణికులు అక్కడికి వెళ్తారని అందుకోసమే విమాన సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. శ్రీలంక, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీస్‌కు ఆదరణ లభిస్తోందని భావిస్తున్నాట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)