30 వరకే అవకాశం....!

Telugu Lo Computer
0

 

ఐటీఆర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021 గడువు విధించింది. ఈ లోపు ఐటీ చెల్లిస్తే ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయ శాఖ తెలిపింది. వాస్తవానికి ఐటీఆర్ దాఖలుచేయడాకి జూలై 31 అయితే పలు కారణాల ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయడం కుదరని వారు సెప్టెంబర్ 30 లోపు చెల్లించ వచ్చు. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద ఎటువంటి వంటి అదనపు చార్జీలులేకుండా పన్ను చెల్లించడానికి ఉన్న ఆఖరు తేదీని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌​ ట్యాక్సెస్‌ ప్రకటించింది. వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా పన్ను చెల్లింపులో భాగంగా ఫారమ్‌ 3 వల్ల ఇబ్బందులు ఎదురైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ప్రకటించింది. అదనపు ఛార్జీలతో పన్నులు చెల్లించేందుకు అక్టోబరు 31కే చివరి తేది అని, ఇకపై గడువు పొడగింపులు ఉండవని సీబీడీటీ  తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 29న సీబీడీటీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)