రత్నకలశం

Telugu Lo Computer
0


ధారానగర  శివార్ల లో కుమ్మరి దంపతులు నివసిస్తూ వుండేవారు. ఒకనాడు ఆ కుమ్మరి మట్టికోసం త్రవ్వుతూ  వుండగా ఒక రత్నకలశం బయట పడింది.అతను భార్యను పిలిచి నీవు వెళ్లి రాజుకు ఈ వార్తా చెప్పిరమ్మన్నాడు. 

ఆ కుమ్మరి పడుచు వెంటనే రాజుగారి సభ కు వెళ్లి ఆ రాజుతో యిట్లనెను.

                  దేవ మత్భర్త ర నాదృష్టం నిదానం వల్లభేనియే 

                  న పశ్య న్నేవతత్రాస్తే త్వాని జ్ఞాన పయి తుభ్యగాం 

తా:--- ప్రభూ! నా భర్త కుండలు చేయడం కోసం మట్టిని తవ్వు చుండగా నిధి యొక్కటి కనబడింది. దానిని చూసి ఆయన రాజుగారికి ఈ విషయము చెప్పి రమ్మని నన్ను పంపించగా వచ్చితిని . ప్రభువులు దానిని పరీక్షించి స్వాధీన పరుచుకోమని ప్రార్థన. భోజరాజు తన నగర వాసుల సత్యసంధత కు సంతోషించి వెంటనే ఆ ప్రదేశమునకు పోయి దానిని తెరిపించి చూశాడు.  దాని యందు అమోల్యములైన రత్నములుండెను.అప్పుడు ఆ కుమ్మరి పడుచు రాజుతో నిట్లనెను.

        రాజన్ చంద్ర స్స్వ మాలోక్యత్వాంతు భోథమమ్ గతం 

        రత్న శ్రేణి మసా న్మన్యే నక్షత్రాణ్య భ్యుపాగమం 

తా:--రాజా! నేవీ భువికి చంద్రుని వంటి వాడవు. నిన్ను సేవించుట కై ఈ భూమిలోకి వచ్చిన నక్షత్ర శ్రేణి వలె

నీవు పరీక్షించు ఈ విలువైన  రత్నములు మెరుస్తున్నవి.అన్నది 

రాజు ఆ కుమ్మరి పడుచు చమత్కృతికి ఆనందించి ఆ నిధిని ఆ దంపతులకు యిచ్చివేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)