సామెతలు ...!

Telugu Lo Computer
0



* తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ!

* తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు!

* తడిసి గాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు!

* తడిసిన కుక్కి బిగిసినట్టు!

* తడిసి ముప్పందుం మోసినట్టు!

* తద్దినము కొని తెచ్చుకొన్నట్టు!

* తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు!

* తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము!

* తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు!

* తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును!

* తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట!

* తడి గుడ్డతో గొంతులు కొయ్యడం!

* తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట!

* తంతే బూరెల బుట్టలో పడ్డట్టు!

Post a Comment

0Comments

Post a Comment (0)