పక్షిని వేటాడి తిన్న తాబేలు!

Telugu Lo Computer
0

శాఖాహార జాతికి చెందిన ఒక పెద్ద తాబేలు చిన్న పక్షిని వేటాడి తిన్నది. ఇది చూసిన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆశ్చర్యపోయారు. సీషెల్స్‌లోని ఫ్రీగేట్ ద్వీపంలో ఈ ఏడాది జూలైలో ఈ ఘటన జరిగింది. వెజిటేరియన్‌ జాతికి చెందిన ఒక పెద్ద తాబేలు ఉన్నట్టుండి చెట్టు దుంగపై ఉన్న ఒక చిన్న పక్షి వెంటపడింది. ఆ పక్షి దాని బారి నుంచి తప్పించుకుని దుంగ చివరి వరకు వెళ్లింది. అయితే అక్కడ నుంచి ఆ పక్షి తప్పించుకోలేకపోయింది. ఇంతలో తాబేలు ఒక్కసారిగా తన నోటితో దాని మెడ పట్టుకుని కొరికి తినేసింది.

ఊహించని ఈ ఘటనను చిత్రీకరించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర పరిశోధకులు ఇది చూసి నిశ్చేష్టులయ్యారు. సీషెల్స్‌లోని శాఖాహార జాతికి చెందిన ఆ తాబేలు టేస్ట్‌ కోసం మాంసాహారిగా మారిందా అని ఆశ్చర్యపోయారు. ఆ తాబేలు వేటాడిన విధానం చూస్తే చిన్న పక్షులను వేటాడి తినడం ఆ జాతి తాబేలుకు ఇదే తొలిసారి కాదన్నది అర్థమవుతోందన్నారు. పక్షుల గూళ్ల నుంచి రాలి పడే గుడ్లు, చేపలను తిని అవి మాంసాహారానికి అలవాటు పడి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ట్వీట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)