అడ్రస్ ప్రూఫ్ లేకుండానే....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 4 August 2021

అడ్రస్ ప్రూఫ్ లేకుండానే....!



ఇటీవల కాలంలో ఆధార్ ప్రాముఖ్యత బాగా పెరిగింది.  ఆధార్ కార్డును పొందిన వారు చాలా మంది వివిధ కారణాల వల్ల చిరునామాలు మార్చుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక ప్రూఫ్ కావాలని ఆధార్ అప్ డేట్ సెంటర్ సిబ్బంది కోరుతుంటారు. అడ్రస్ ఫ్రూఫ్ లేకపోవటంతో చాలా మంది ఆధార్ అప్ డేట్ చేయించుకోలేక అగచాట్లు పడుతారు. ప్రస్తుతం యూఐడీఎఐ ఆధార్ అప్ డేట్ కోసం అడ్రస్ ఫ్రూఫ్ తో పనిలేకుండా అడ్రస్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది. కార్డ్ లో అడ్రస్ వివరాల్లో మార్పులు చేయాలంటే పాస్ పోర్ట్ , బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయల్సి ఉంటుంది. అలా చేస్తేనే అధార్ అడ్రస్ అప్ డేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం యూఐడీఎఐ ఇచ్చిన వెసులుబాటుతో బంధువులు, ఇతర కుటుంబసభ్యుల అధార్ ప్రూఫ్ తో అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం ఏర్పడింది.

1. ఆధార్ లో అడ్రస్ అప్ డేట్ చేయాలనుకునే వారు https://uidai.gov.in/ వెబ్ సైట్ లింకును ఓపెన్ చేయాలి.

2. లింక్ ఓపెన్ అయ్యాక మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి.

3. అనంతరం ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

4. వెరిఫై అనంతరం మీ ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకునేందుకు ఓ అప్రూవల్ లింక్ వస్తుంది.

5. వచ్చిన లింక్ పై క్లిక్ చేసి దానిని ఓ పెన్ చేసి మనం ఏఅడ్రస్ అయితే ఇవ్వదలుచుకున్నామో దానిని అందులో పొందుపరచాలి.

6. రిక్వెస్ట్ సమయంలో మీ కాంటాక్ట్ నెంబర్ ను ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అనంతరం మీ అధార్ అడ్రస్ మార్చుకునేందుకు 28 అంకెల సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

7. 28 అంకెల ఎస్ఆర్ ఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత అడ్రస్ మార్చుకునేలా రిక్వెస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇదంతా పూర్తయిన అనంతరం ఓ పిన్ నెంబర్ మీ చిరునామాకు పోస్ట్ ద్వారా మీరు మార్చుకున్న అడ్రస్ కు వస్తుంది.

8. ఆ సీక్రెట్ కోడ్ ను ఎంటర్ చేసిన ఆధార్ అడ్రస్ రివ్యూ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. గడువు సమయం ముగిసిన తరువాత మీ అధార్ లో అడ్రస్ అప్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.

No comments:

Post a Comment

Post Top Ad