గుంటగలగర ఆకు - ఉపయోగాలు

Telugu Lo Computer
0

 

మన భారతీయ ఆయుర్వేదం మనకు ఎన్నో మూలికలను, ఔషధ విలువలు కలిగిన ఎన్నో మంచి విషయాలను అందించింది. ఇవి కొన్ని ఆకుల రూపంలొ కొన్ని వేర్ల రూపంలో, కొన్ని కాండములలో, కొన్ని పండ్లలో, కొన్ని పండ్ల గింజలలో,  కొన్ని చెట్టు బెరడులో ఇలా ఒక్కొక్క ఔషధం ఒక్కొక్క స్థితిలో లభ్యమవుతుంది.

అయితే గుంట గలగర అనే ఈ ఆకు మనకు పంచే ఔషధ విలువను మనం చూస్తే నిజంగా ఇంత మేలు చేస్తుందా అని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది నాటు వైద్యం పేరుతో మనం దూరమవుతున్నాం. ఇప్పటికీ మన  పెద్దలు పల్లెటూరిలో పొలం పనులు చేసిన అనుభవం ఉన్నవారికి ఈ ఆకుల గురించి తెలుసు. ఇది చేలలో, చేల గట్లు మీద, బంజరు భూములలో,  కాలువ గట్ల మీద విస్తారంగా లభ్యమయ్యే ఒక కలుపు మొక్క. 

ప్రాచీన భారతీయులకు అందాన్ని ఆరోగ్యాన్ని ఆయువును అందించిన అమృత ఔషథం- గుంటగలగర. ఆకలి కోల్పోయిన వారికి ఇది అమృతం వంటిది.

ఇది మందగించిన కంటిచూపును పెంచడమే కాక పూర్తిగా కోల్పోయిన దృష్టిని కూడా తిరిగి అందిస్తుంది. ఊడిపోయిన, నెరసిన, పలుచగా మారిన తలజుట్టును తిరిగి నల్లగా దృఢంగా వచ్చేలా చేస్తుంది. ఇది నాశికలో శ్వాసకు అడ్డుపడే చెడు కఫాన్ని, నాశికలో పెరిగే కొయ్య కండరాలను కరిగిస్తుంది. ఇది శరీర రక్షణకు మూలమైన కాలేయం, ప్లీహం వంటి అవయవాలకు ప్రాణం పోసి రక్తాన్ని శుద్ధి చేసి, వృద్ధి చేస్తుంది. అంతేకాదు చర్మంపై మచ్చలు, ముడతలు పోగొడుతుంది. దీన్ని ఒక సంవత్సరంపాటు వాడటం వల్ల సర్వవ్యాధులను నివారిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)