ఏ పాలు తాగుతున్నారు?

Telugu Lo Computer
0


పూర్వం రోజుల్లో ఎవరు సంపన్నులు అంటే ఎవరి ఇంట్లో పశువులు ఎక్కువగా ఉంటే వారే సంపన్నులు. ప్రతి ఇంటికి 2 దేశి అవులైన ఉండేవి. దేశీ ఆవు పాలు అమృతం తో సమానం అంటారు. దేశీ ఆవుల యొక్క గొప్పతనం తెలుసుకొని, విదేశీయులు మన ఆవులను వారి దేశాలకు తీసుకెళ్తున్నారు, వారు ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. మరి మనం వారి ఆవులను తెచ్చుకొని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. ఈ A1 ఆవు పాలు కాన్సర్ ను ప్రేరేపిస్తుందని, కొన్ని దేశాలలో ఈ ఆవులను, నిషేదించారు. మరి మీరు A1 మరియు A2, ఈ రెండిటిలో ఏ పాలు తాగుతున్నారు ? అస్సలు దీని అర్ధం ఏమిటి? మన దేశీ ఆవులకున్న గొప్పతనం ఏమిటో పూర్తిగా తెలుసుకోండి .

 భారతదేశంలో ప్రాచీన ఆవు జాతులను దేశీ ఆవులు, A2 ఆవులని  అంటారు. ఇవి ఇచ్చే  పాలను A2 పాలు అని అంటారు. స్వదేశీ ఆవు పాలలో A2 బీటా-కెసిన్ ఉంటుంది, ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి మంచిది అని పరిశోధనలలో తేలింది

 విదేశీ జాతి ఆవులను A1 ఆవులు అని అంటారు.  ఇవి ఇచ్చే పాలను A1 పాలు అని అంటారు. మన దేశంలో మార్కెట్లో ఎక్కువగా దొరికేది A1 పాలే.  A2 పాల వినియోగం చాలా తక్కువ. A1 పాలలో A1 బీటా-కేసిన్ ఉన్నందున డయాబెటిస్, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు దారితీస్తాయని అనేక పరిశోధనలు  నిర్ధారించాయి. 

భారతీయ ఆవులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ.  పాలు తక్కువ ఇచ్చినా  న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. మరి విదేశీ జాతి ఆవు పాలలో న్యూట్రిషనల్ వాల్యూ తక్కువగా ఉంటుంది. "గంగి గోవు పాలు గరిటడైన చాలు" ... అని మహా కవి వేమన అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)