అమ్మ అమ్మే కదా...!

Telugu Lo Computer
0


ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను చిరుత చెర నుంచి తప్పించి కాపాడింది. చిరుతను బెదిరించి.. ఐదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. చంద్రపుర్‌ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునోనా గ్రామానికి చెందిన అర్చన ఈ నెల 3న బహిర్భూమికి తన ఇంటి దగ్గర ఉన్న అడవిలోకి వెళ్లింది. అర్చనతో పాటు ఐదు సంవత్సరాల ఆమె బిడ్డ ప్రజాక్త కూడా అడవిలోకి వెళ్లింది. కొద్దిదూరం వాళ్లిన తర్వాత వారిద్దరు ఆ అడవిలో విడిపోయారు. బిడ్డా అరుపులు వినపడి పరుగున వచ్చిన తల్లికి అక్కడ ఘటన చూసి నోటి నుంచి మాట రాలేదు. కూతురి తల మొత్తం ఓ చిరుత పులి నోట్లో ఉంది. అది చిన్నారిని లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. చిరుతను చూసిన మహిళ తొలుత భయపడిపోయింది. కానీ తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండటంతో ధైర్యం తెచ్చుకుంది. వెంటనే తేరుకున్న అర్చన చిరుతపులి వెంట పడింది. పక్కనే ఉన్న ఓ వెదురు కర్రను తీసుకుని ఆ చిరుత కొట్టింది.

ఆమె భయపడకుండా దాన్ని కొట్టడానికి ప్రయత్నించింది. చిరుత చేసేదేమీ లేక అక్కడినుంచి పరారైంది. అర్చన తీవ్ర గాయాలపాలైన కూతుర్ని ఎత్తుకుని ఇంటికి పరిగెత్తింది. భర్తకు విషయం చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. చిరుతపులి దాడిలో చిన్నారి పై, కింద దవడ ఎముకలు విరిగి, పక్కకు జరిగాయి. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మూతి భాగాన్ని సరిచేయటానికి సోమవారం పూర్తి స్థాయి శస్త్ర చికిత్స చేయనున్నారు. దీనిపై అర్చన మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు నుంచి ఎప్పుడు నేను కళ్లు మూసుకున్నా​.. నా పాప చిరుత నోట్లో ఉన్న దృశ్యమే కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ సంఘటన నుంచి బయటపడుతున్నాను. చిరుతను నేను వెంటాడి కొడితే అది నా మీద దాడి చేస్తుందని భయపడ్డాను. కానీ, నా బిడ్డనలా ఎలా చావనివ్వగలను’’ అని చెప్పుకొచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)