ఉద్యోగపర్వము

Telugu Lo Computer
0

 


.
సుయోధనా , నీవు నీ తండ్రి చెప్పిన మాట వినవయ్యా! ప్రశాంతచిత్తుడవై ఆలోచించి నిర్ణయం తీసుకో , సాక్షాత్తు నారాయణుడే మనమీద ప్రేమతో మనకు హితవు పలకడానికి వచ్చాడు .ఆయన మాటలు పాటించకపోవడం వినాశ హేతువు!నీ తండ్రి బ్రతికి ఉండగనే కులక్షయ కారకుడిగా నీవు మారి ఆయన మనసు ఎందుకు క్షోభ పెడతావు? మొండి పట్టుదలను మాని సంధికి అంగీకరించు!. అని భీష్మపితామహుడు హితవు పలికాడు.
.
ఆ తరువాత గురు ద్రోణుడు కూడా హితవాక్యాలు పలికాడు.
.
భీష్మద్రోణులిరువురూ కూడా ఒక మాట కలిసి పలికారు ,"రాజా నీవు మేలుకో !శ్రీకృష్ణుడు సారధిగా గాండీవం చేతబూని అర్జునుడు యుద్ధ రంగంలో ప్రత్యక్షం కాక మునుపే ధర్మజుడిని సందర్శించి కార్యం చక్కదిద్దుకొని నీ వంశాన్ని కాపాడుకో"
...
ఇందరి మాటలు విన్న దుర్యోధనుడు లేచి కృష్ణుని చూసి ఇలా అంటున్నాడు! " అందరూ నన్ను తప్పు పడుతున్నారు ! అసలు నేను చేసిన తప్పేమున్నది ! జూదరి అయి కన్ను,మిన్ను గానక సర్వస్వము పణంగా బెట్టి ఓడిపోయి తన ఇష్టప్రకారమే రాజ్యం వదలి అడవులకెళ్ళాడు ధర్మజుడు,అది మా తప్పెలా అవుతుంది?".
.
మేము, వారు భూమిని పంచుకొని జీవించడం కల్ల , సూదిమొన మోపినంత భూమిని కూడా వారికి ఇవ్వను ,యుద్ధంలో విజయం వరించిన వారే రాజ్యమేలాలని నిర్ణయించాను.
.
ఈ విదంగా పలికిన దుర్యోధనుని చూచి కోపము, చిరునవ్వు కలగలసి ఒక వింతకాంతితో ముఖము మెరిసిపోగా ఎర్ర తామరల వంటి కన్నులు కలవాడై కృష్ణపరమాత్మ .....
 ,నీ తప్పుఏమీ లేదని నీవు కల్లబొల్లి కబుర్లు చెపితే ఎవరు నమ్ముతారు?
.
నీవు అసలు ఒకనాడు కీడు చేసి మరొకనాడు చేయకుండా ఉన్నావా?
.
తినే అన్నంలో విషం పెట్టించావు.
.
పెద్ద పెద్ద విషసర్పాలతో కరిపించావు.
.
భీముని గంగలో తోయించావు!
.
నిద్రలో ఉన్నవారిని చంపచడానికి లక్క ఇంటిని కాల్పించావు!
.
నీవు ఇన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వారికి దైవం అనుకూలించగా రాజ్య సంపద పొంది హాయిగా జీవిస్తుంటే, కన్నుకుట్టి పాపబుద్దితో వారిమీద కినుక బూని నీవే ఏర్పాటు చేసిన జూదంలో మోసం గ్రహించలేక ఓడిన వారిని జూదరులని అంటున్నావు! 
అసలు జూదం ఏర్పాటు చేయమని, తాను ఆడతానని ధర్మరాజు నీతో అన్నాడా? 
యుద్ధానికి గాని , జూదానికి గానీ పిలిచినప్పుడు పాల్గొనకపోతే ధర్మం కాదని ఆడాడు ,అనర్ధం వచ్చిపడింది!
.
నీవు తప్ప తోబుట్టువులతో జూదమాడి  ఇంటి కోడలినే జుట్టుబట్టి కొలువుకూటానికి ఈడ్చుకొచ్చిన వాడు ఇంతకు ముందెవడయినా ఉన్నాడా?.
.
నీవూ కర్ణుడూ ద్రౌపది ని ఉద్దేశించి కూసిన కారకూతలు, సభ్యసమాజం వినలేని మాటలు, ఇప్పుడు నేను ఈ సభలో మరల అనలేను.
.
ఇన్ని విధాలుగా వారిని వేధించి,విసిగించిన నీవు ఇప్పుడు నావలన ఏ తప్పు జరుగలేదనడం లోకంలో నీకే తగును!.
.
ఈ విధంగా కఠినమయిన వాస్తవాలను శ్రీ కృష్ణుడు ప్రస్తావిస్తుంటే 
ఎర్రని కందగడ్డ వంటి ముఖము కలిగినవాడయి దుశ్శానుని ,తక్కినవారిని తనతో రమ్మని సభనుండి విసవిసా బయటకు నడచినాడు దుర్యోధనుడు!..

Post a Comment

0Comments

Post a Comment (0)