సామెతలు ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 26 July 2021

సామెతలు ...!


* ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు !

* ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు !

* ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు !

* ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ !

* ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు !

* ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన శృంగారం వృదా !.

* ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు !

* ఎంత చెట్టుకి అంత గాలి !

* ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది !

* ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?

* ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?

* ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు !

* ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు !

* ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు !

* ఎవడి బ్లాగుకు వాడే సుమన్ అని !

No comments:

Post a Comment