నాన్న... నువ్వో గొప్ప తండ్రివి!

Telugu Lo Computer
0

 


విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒకటి చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన 'నారప్ప' చూశాక... తండ్రి గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ''నారప్ప' ఎమోషనల్ రోలర్ కోస్టార్ రైడ్ అని, అందులో వెంకటేష్ అద్భుతంగా నటించారు" అని ఆశ్రిత తెలిపారు. 

"మనం ఎప్పుడూ సినిమా చూసే విధంగా... నేనూ సినిమా విడుదలైన రోజు మొదటి షో చూడాలని, ఇంటి దగ్గర ఉండి ఉంటే బావుండేదని ఆశించా. కానీ, పరిస్థితులు మారాయి. నేను చాలా దూరంగా ఉన్నాను. కానీ, మిమ్మల్ని (వెంకటేష్ ను ఉద్దేశిస్తూ) ప్రశంసించకుండా ఉండలేను. ప్రతి ప్రశంసకు మీరు అర్హులు. ఆ లుక్ ఏంటి? ఆ క్యారెక్టర్ ఏంటి? ఆ నటన ఏంటి? అద్భుతం. మీరెప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు" అని ఆశ్రిత తన పోస్టులో పేర్కొన్నారు. 

'నారప్ప' పాత్రలో వెంకటేష్ అంత అద్భుతంగా ఉండటానికి కారణం నిజజీవితంలోనూ ఆయన వ్యక్తిత్వం అదేనని ఆశ్రిత వివరించారు. "కుటుంబం కోసం ఎంత దూరమైనా సాహసించే తండ్రిగా మీరు ఆ పాత్రలో ఎందుకు అంత అద్భుతంగా ఉన్నారో తెలుసా? ఎందుకంటే... అది మీరే కాబట్టి. నిజంగా నువ్వు గొప్ప తండ్రి. అమేజింగ్ ఫాదర్. తెరమీద, తెర వెనుక స్వచ్ఛమైన మనసున్న మనిషివి. మీ వ్యక్తిత్వంలో నేను సగం చేసుకున్నా... గొప్ప ఘనత సాధించినట్టు భావిస్తా" అని ఆశ్రిత ఎమోషనల్ అయ్యారు. వెంకటేష్ లాంటి వ్యక్తి కచ్చితంగా ఎవరూ ఉండరని, తన తండ్రిని అమితంగా ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)