ఏకవీర

Telugu Lo Computer
0


గురువు గారు..మీ నవల ఏకవీర ను చిత్రంగా తీసాము.. మీరో సారి చూసి చెప్పాలి ఎలా ఉందో అని రామారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారట. హా చూసాము.. అఘోరిచినట్టుంది.. మొత్తం నవలను ఖునీ   చేశారన్నారట,  ఏ మాత్రము తడుముకోకుండా.  నా ఏకవీర నవలపై చారిత్రిక గ్రంథాల ప్రభావం ఉంది. దాని మీద  పలు తెలుగు కావ్యాలతో పాటుగా పలు ఆంగ్ల నవలల ప్రభావం కూడా ఉంది. ఈ విషయాన్ని కవిసామ్రాట్  ఓ సారి  ప్రస్తావిస్తూ సైలాస్ మారినర్‌లోని కథానిర్మాణం, కాళిదాస భవభూతులలోని శిల్పం, ఠాగూర్ నౌకాడూబీలోని శరీరవాంఛా దూరమైన ప్రేమధర్మం. నా తెలుగు రచనాశక్తీ - ఈ నాల్గింటినీ కలిపి ఏకవీరగా చేశాను అన్నారు, దానిని సినిమా గా తీసి అనేక మార్పులు చేసి ఖునీ చేసారాని వారు వాపోయారు. చిత్రం ఆనాటి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్లాప్ అయిన రీ రన్  లో మాత్రం హైదరాబాద్ లో వంద రోజులు ఆడింది. సంగీత సాహిత్యము అభినయం తప్ప , అసలు రచయిత రచనను మార్పులు చేసి తీయడం వల్ల , ఆ నవల అప్పటికే చాలా ప్రసిద్ధి చెందినది కావడం వల్ల ప్రేక్షకులకు రుచించలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)