త్రిషకు త్వరలోనే పెళ్లి ?

Telugu Lo Computer
0


ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా రాణించి ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో అలరిస్తున్న నటి త్రిష.  త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌తో త్రిష ప్రేమలో పడిందని, త్వరలో వీళ్లిద్దరూ తమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకోనున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్దలు కూడా వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, అతి త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. గతంలో త్రిషకి వ్యాపారవేత్త వరుణ్‌తో నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అయితే.. మనస్పర్థలు రావడంతో వారి బంధానికి మధ్యలోనే ది ఎండ్‌ కార్డ్‌ పడింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)