వన్ సైడ్ లవ్ ....!

Telugu Lo Computer
0


తమిళనాడులోని తంజై జిల్లా పట్టుకోట్టైకి చెందిన పాండ్యన్ కుమార్తె మౌనిక (18) తిరువారూర్ జిల్లా ముత్తుపేట పట్టణ పంచాయతీకి చెందిన ప్రాంతంలో ఉన్న తమ బంధువుల ఇంట్లో ఉంటూ తిరుచ్చి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతోంది. మౌనిక బంధువు అయిన ముత్తుపేట, తిరుకలూర్ గ్రామానికి చెందిన శివశంకర్ (28) అనే యువకుడు మౌనికను వన్‌సైడ్ లవ్ చేసినట్లు తెలిసింది. మౌనికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆమె తల్లి తండ్రులను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన శివశంకర్ శనివారం రాత్రి రాజకుమారి ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న మౌనిక ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో మౌనిక అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు శివశంకర్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)