సామెతలు ....!

Telugu Lo Computer
0



* అప్పు చేసి కొప్పు తీర్చిందట !

* అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది !

* అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?

* అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?

* అప్పులేని వాడే అధిక సంపన్నుడు !

* అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు !

 

* అనగా అనగా రాగం తినగా తినగా రోగం !

* అనువుగాని చోట అధికుల మన రాదు !

* అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట !

* అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు !

* అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు !

* అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు !

* అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?

* అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

* అప్పనుచూడబోతే రెప్పలు పోయినై !

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)