16 దేశాల్లో ప్రవేశానికి అనుమతి

Telugu Lo Computer
0


16 ఐరోపా దేశాలు కొవిషీల్డ్‌ తీసుకొన్నపర్యాటకుల రాకకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఈ టీకా తీసుకొన్నవారు తమ దేశాల్లోకి రావచ్చని పేర్కొన్నాయి. ఇది నిజంగా పర్యాటకలు ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త. ఒక దేశానికి మరొక దేశానికి మధ్య నిబంధనలు మారుతుంటాయి. మీరు టీకా తీసుకొన్నప్పటికీ.. ప్రయాణానికి ముందే ఆ దేశ స్థానిక నిబంధనలు స్పష్టంగా తెలుసుకోండి'' అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా  ట్వీట్‌ చేశారు. ఈ టీకా తీసుకొన్నవారికి ఐరోపా సమాఖ్య దేశాల్లో అనుమతులు లభించకపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నుంచి మెల్లగా కొన్ని దేశాలు ఈ టీకా తీసుకొన్నవారిని అనుమతించడం మొదలుపెట్టాయి. వీటిల్లో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్లాండ్‌, జర్మనీ, గ్రీస్‌, హంగేరీ, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్‌, లాత్వియా, నెదర్లాండ్స్‌, స్లొవేనియా, స్పెయిన్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ కూడా ఆమోద ముద్రవేసింది. భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ పేరుతో తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ప్రయాణికులను ఆదివారం నుంచి అనుమతిస్తామంటూ ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)